హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రతా బలగాలపై అమిత్ షా ప్రశంసలు

కుల్గాం(జమ్మూకశ్మీర్) ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. J&K పోలీసులు, ఆర్మీ, CRPF, ఇంటెలిజెన్స్ వర్గాల సమన్వయంతో లష్కరే తోయిబా చివరి ఉగ్రవాది లతీఫ్ భట్‌ను ఇవాళ మట్టుబెట్టారని 'X'లో పేర్కొన్నారు. అలాగే నిన్న మరో ఉగ్రవాది ఉమర్ నిస్సార్‌ను సైతం హతమార్చాయన్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసిన భద్రతా బలగాలకు, జవాన్లకు అమిత్ షా సెల్యూట్ చేశారు.