GNTR: జిల్లా కేంద్రంలోని బారా ఇమామ్ పంజా సెంటర్‌లో పేకాట స్థావరంపై లాలాపేట పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,39,110 నగదు, 52 పేక ముక్కలు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ శివప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి.. 18మంది అరెస్ట్


