PLD: చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపసుమర్రు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో, మంగళవారం రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో పడిపూజ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పడిపూజ మహోత్సవాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడిపూజ..!


