హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు నగరపాలక సంస్థలో 'కమీషన్ల' కలకలం

చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కొన్ని నెలలుగా కమీషన్ల రచ్చ కొనసాగుతోంది. కీలక ప్రజాప్రతినిధి అనుచరుడు కాంట్రాక్టర్లు ఏ పని చేసినా 18 శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన వేధింపులతో గుత్తేదారులు, ఉద్యోగులు హడలిపోతున్నారు. త్వరలో బాధ్యతలు చేపట్టే కౌన్సిల్ అయినా ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.