హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో స్మార్ట్ బస్ షెల్టర్లు

తిరుమలలో టీటీడీ ఉచితంగా నడిపే ధర్మరథాలను దశలవారీగా డీజిల్ బస్సుల నుంచి ఎలక్ట్రిక్ బస్సులకు మారుస్తోంది. దాతల సహకారంతో ప్రస్తుతం 46 ధర్మరథాలు నడుస్తున్నాయి. ఇప్పటి 21 షెల్టర్లలో సౌకర్యాలు లేనందున మరో నాలుగు షెల్టర్లతో పాటు సీసీ కెమెరాలు, డిజిటల్ డిస్ప్లేలు, సోలార్ ప్యానెళ్లతో స్మార్ట్ షెల్టర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. కొన్నింటిని కట్టేందుకు రేమండ్స్ గ్రూప్ ముందుకొచ్చింది.