హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుధవారం: నేటి తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 6-8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠంలో 22 కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 80,833 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,771 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.