హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక

అనంతపురం: గుత్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మండల కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఉంటుందన్నారు. కావున ఎంపీటీసీలు, సిబ్బంది తప్పకుండా హాజరుకావాలని కోరారు.