బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీ ప్రధాన రహదారిపై పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయి. విద్యుత్ పొదుపు చేయాలని ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు సూచిస్తున్నప్పటికీ, సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట వెలుగుతున్న దీపాలను నియంత్రించి విద్యుత్ వృథాను అరికట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు


