హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. టీడీపీలోకి 30 కుటుంబాలు

KRNL: ఓర్వకల్లు మండలం గుడుంబాయి తండాకు చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ నేనావత్ దీప్తిబాయి, శ్రీను నాయక్‌తో పాటు 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా, ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మణపల్లె నాగిరెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.