హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విదేశీ ఉద్యోగాల పేరిట దగా..!

VSP: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసి కంబోడియాకు తరలించారు. అక్కడ వారి చేత డిజిటల్ అరెస్ట్ మోసాలు చేయిస్తున్న బొంగు మురళి, చుక్క రాజేశ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు.