హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. నిన్న శ్రీవారిని 80,833 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,771 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.