JGL: రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన మహేశ్(25) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తీవ్ర విషాదంలోనూ ఆయన కుటుంబ సభ్యులు మహేశ్ నేత్రాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు మృతుడి నేత్రాలను సేకరించారు. మరణించినా మరో ఇద్దరికి కంటి చూపునిచ్చి, పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
తెలంగాణ
మరణంలోను ఇద్దరికి కంటి చూపు


