హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ

MBNR: జిల్లాలోని మహిళలకు ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ ఆధ్వర్యంలో ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 27 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, 19–45 ఏళ్ల మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, రెండు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు.