GNTR: అధిక లాభాల ఆశతో ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టిన అంగలకుదురుకు చెందిన సత్యనారాయణ(71) రూ.52 లక్షలు నష్టపోయినట్లు తెనాలి(R) పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరిలో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనలు నమ్మి నగదు జమ చేశారు. లాభాలు రాకపోగా, పెట్టుబడి వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రేడింగ్ పేరుతో భారీ మోసం


