హైదరాబాద్: 28°C
తెలంగాణ

19 నుంచి ఇందిరమ్మ బీమా ఫారాలు: కలెక్టర్

ADB: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తు ఫారాల పంపిణీ గురువారం(రేపు) నుంచి మొదలవుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఒకరికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. గ్రామ పంచాయతీల్లో ఫారాలు ఇస్తారు, ఎంపీడీవోలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని కలెక్టర్ తెలిపారు.