హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో సేవా కార్యక్రమాలు..!

VZM: బాబామెట్టలో సత్యసాయిబాబా జయంతిని పురస్కరించుకొని ఇవాళ నుంచి 23వ తేదీ వరకు సత్యసాయి సంకల్ప మందిరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా భజనలు, అన్నదానం, వైద్య శిబిరం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.