హలాసనం వెన్నెముకను సాగదీసి, వెనుక కండరాలను బలోపేతం చేస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించి, వెన్నెముకను యవ్వనంగా ఉంచుతుంది. ఈ ఆసనం వేసేటప్పుడు పొత్తికడుపు కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. శరీరం తలకిందులుగా ఉండే ఈ భంగిమ వల్ల మెదడుకు, ముఖానికి రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక స్పష్టతను, ఏకాగ్రతను పెంచి మెదడును ప్రశాంతపరుస్తుంది.
ఆరోగ్యం
హలాసనం వల్ల కలిగే ఉపయోగాలు


