హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్యే

BHPL: చేయూత పెన్షన్ల మంజూరులో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సూచించారు. లంచం అడిగే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, పెన్షన్ రాని వారు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను సంప్రదించాలని తెలిపారు. లంచం డిమాండ్‌పై ప్రజలు సమాచారం అందించాలని కోరారు.