హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా విక్రయిస్తున్న మహిళ పట్టివేత

BHPL: కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజక్కపల్లిలో అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న సంకటి సారక్క అనే మహిళను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి ఆమె వద్ద ఉన్న నాలుగు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ, నిల్వ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని SI త్రిలోక్ నాథ్ రెడ్డి హెచ్చరించారు.