హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

HNK: హసన్‌పర్తి మండలం అనంతసాగర్ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన వినయ్‌రెడ్డి (20) తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోల్ బంకుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో వెనుక వస్తున్న కారుపై పడిపోయాడు. తీవ్ర గాయాలైన యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.