హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్ సీజ్

KNR: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి మానేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన గెల్లు అశోక్ (29) మంగళవారం ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.