హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

WGL: సంగెం మండలం ఎలుగూరు–చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయసు 25–30 ఏళ్లు ఉంటుందని జీఆర్పీ సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. యువకుడి వివరాలు తెలిసినవారు 9849749220, 8712658627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.