హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ బెట్టింగ్‌ వ్యసనం.. యువకుడి మృతి

BHPL: ఆన్‌లైన్ బెట్టింగ్‌ కారణంగా కుటుంబంలో తలెత్తిన వివాదంతో నిమ్మగూడెంకు చెందిన జనగాం రమేష్ (30) ఈ నెల 9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, వారం రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు. భార్య రజిత ఫిర్యాదుతో అడవిముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.