NLG: కేతేపల్లి మండలంలో రైతులు రెండో పంట సాగుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు.కేతేపల్లి లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మండల రైతులకు సాగునీటి కొరత రాకుండా చెరువులు, కుంటలను నింపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మకుండా రైతులంతా రెండో పంట సాగుకు సిద్ధం కావాలని కోరారు.
తెలంగాణ
రైతులకు సాగునీటి భరోసా: ఎమ్మెల్యే


