NRML: భైంసా పట్టణంలోని పోలీసు క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
నేడు పోలీసు ప్రజావాణి


