హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ చిన్నారులకు చదువే సాహసం..!

ASR: జీ.మాడుగుల మండలం వయ్యంపల్లికి చెందిన సుమారు 15 మంది చిన్నారులు చదువు కోసం రోజూ 2 కి.మీ. దట్టమైన అటవీ మార్గంలో ప్రయాణిస్తున్నారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ తరబూసింగి పాఠశాలకు చేరుకుంటున్నారు. రోడ్డు సదుపాయం లేక అడవి జంతువులు, విషసర్పాలు సంచరించే మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. చిన్నారుల చదువు ప్రయాణం సాహసంతో కూడుకున్నదిగా మారింది.