హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం

JGL: కొండగట్టు చందనోత్సవం, మహా సంప్రోక్షణకు హాజరుకావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మంగళవారం లోక్‌భవన్‌లో చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం కలిసి ఆహ్వానించారు. నవంబర్ 15 నుంచి 20 వరకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్లకోసారి జరిగే మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఆలయ విశిష్టతను గవర్నర్‌కు వివరించారు. దేవాదాయ కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉన్నారు.