హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

పంజాబ్ లుథియానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మచ్చివారా ప్రాంతంలో ఆగివున్న టిప్పర్ లారీని మహీంద్రా పికప్ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 27 మంది గాయపడ్డారు. వీరంతా మాతా నైనా దేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.