హైదరాబాద్: 28°C
క్రీడలు

షమీ రాజస్థాన్‌కు.. లక్నోకు సామ్ కరన్

ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు మరో ట్రేడ్ డీల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి మారాడు. మరోవైపు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లాడు. ఈ ఆటగాళ్ల మార్పులు ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. రాబోయే సీజన్‌లో కొత్త జట్ల తరఫున వీరిద్దరూ ఎలా రాణిస్తారో చూడాలి.