హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ చెప్పిన ఆ మాట ఆశ్చర్యపరిచింది: CSK యజమాని

ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తనను ఆశ్చర్యపరిచిందని సీఎస్‌కే యజమాని రూపా గురునాథ్ తెలిపారు. ఆటగాళ్లను రిలీజ్ చేసే అంశంపై శనివారం జరిగిన సమావేశంలో ధోనీ స్వయంగా తన పేరును కూడా జాబితాలో చేర్చాలని కోరినట్లు వెల్లడించారు. ‘‘బహుశా నా పేరును కూడా అందులో చేర్చాలేమో’’ అని ధోనీ ప్రశాంతంగా చెప్పినట్లు రూపా గుర్తుచేసుకున్నారు.