భారత స్టార్ షూటర్ మను భాకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ షూటింగ్ ఫెడరేషన్ (ISSF) అథ్లెట్స్ కమిటీలో ఆమె ఎన్నికైంది. 2026-2030 కాలానికి పిస్టల్ విభాగంలో సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టనుంది. ఈ పదవి కోసం 10 మంది పోటీపడగా, మను భాకర్ విజయం సాధించింది. దోహాలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఎన్నికలు నిర్వహించారు.
క్రీడలు
భారత స్టార్ షూటర్‌కు అరుదైన గౌరవం


