MDK: శివంపేట మండలం పిల్లుట్లలో జరిగిన పేలుడు ఘటనకు నేటితో 29 ఏళ్లు పూర్తయ్యాయి. 1997 నవంబర్ 17న నక్సల్స్ పేల్చిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసు అధికారుల బృందం మందుపాతరకు బలైంది. ఈ దుర్ఘటనలో అప్పటి తూప్రాన్ డీఎస్పీ అవ్వారు బాలసుబ్రమణ్యం, సీఐ వెంకటస్వామితో పాటు మరో నలుగురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అమరులైన పోలీసుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు.
తెలంగాణ
పోలీసుల త్యాగానికి నేటితో 29 ఏళ్లు..!


