హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చేయూత పెన్షన్లు మంజూరు పత్రాలు పంపిణీ

JN: జనగామ పట్టణంలో 716 మందికి నూతన చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. మంగళవారం పురపాలక సంఘం కార్యాలయంలో పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరుకాగా, మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.