JGL: మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న మద్దుట్లకు చెందిన మల్లయ్యను ఓ కారు వేగంగా ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో భార్య రాజవ్వ కన్నీరుమున్నీరైంది. పుట్టెడు దుఃఖంలోనూ భర్త రెండు కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చింది.
తెలంగాణ
రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి


