SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో సర్పంచ్ బైర మానస రాజేందర్ ఆధ్వర్యంలో నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను అర్హులకు పంపిణీ చేశారు. గీత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా కల్పిస్తోందని, అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యమని సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
'ప్రజా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట'


