హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సొంతూరిని వీడిన పేద కుటుంబం

మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన కోటమ్మ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాకపోవడంతో వరంగల్‌కు వలస వెళ్లారు. 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్నా ఇల్లు మంజూరు కాలేదనే ఆవేదనతో తమ గుడిసెకు నిప్పుపెట్టుకుని ఊరు విడిచారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.