హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ. 7కోట్ల స్కాం కేసులో కీలక పరిణామం!

గుంటూరు: జనసేన నేతల పేర్లతో వెలుగు చూసిన రూ. 7 కోట్ల భారీ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు సీఐడీకి అప్పగించారు. ప్రధాన నిందితులుగా ఉన్న ధరణీకృష్ణ, పెద్దిరాజుపై రెండు కేసులు నమోదు కాగా.. ధరణీ కృష్ణను మంగళగిరి పోలీసులు ఇప్పటికే విచారించారు. కాగా నిందితులు ఉద్యోగాలు ఇప్పిస్తామని 36 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేశారు.