హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగతనానికి వచ్చారనే అనుమానంతో ముగ్గురికి దేహశుద్ధి!

VSP: మారికవలసలో దొంగతనానికి వచ్చారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. వారి వద్ద వన్ గ్రామ్ గోల్డ్ గాజులు, కటింగ్ బ్లేడ్, స్క్రూ డ్రైవర్‌తో పాటు సిరంజీలు, డ్రగ్స్‌కు సంబంధించిన వస్తువులు, ఒక బైక్‌ను గుర్తించి నిలదీశారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం క్రైమ్ పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.