హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి అడ్లూరిని కలిసిన వార్డు మెంబర్ల ఫోరం సభ్యులు

PDPL: ధర్మారం మండల వార్డు మెంబర్ల ఫోరం నూతన సభ్యులు మంగళవారం ధర్మపురిలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.