హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్న ఆరా!

కోనసీమ జిల్లా నగరం గ్రామం వద్ద గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.