హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసుల దాడి!

కృష్ణా: గూడూరు మండలం చిన్న ఆకులమన్నాడు గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గూడూరు ఎస్సై సీహెచ్. దివ్య ప్రకాష్ పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్ళ నుంచి రూ. 5,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.