హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెళ్లిళ్ల సందడి షురూ

జగిత్యాల జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబర్‌లో 18 నుంచి 22, 24 నుంచి 26 తేదీల్లో, డిసెంబర్‌లో 2-4, 10-13, 15-19 తేదీల్లో ముహూర్తాలున్నాయని పురోహితులు తెలిపారు. 150 ఫంక్షన్ హాళ్లు, 300 కమ్యూనిటీ హాళ్లు బుక్ అవుతున్నాయి. బంగారం ధర రూ.10-12 వేలు తగ్గినా హాళ్లు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. రోజుకు రూ.1-3 కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.