హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో చలి పంజా.. 11.7°C నమోదు

NZB: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. KMR జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో అత్యల్పంగా 11.7°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. NZB జిల్లా బోధన్ మండలంచిన్నమావంది, నిజామాబాద్ నార్త్ మండలంగోపన్ పల్లిలో 14.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. చాలాప్రాంతాల్లో 16°C కనిష్ఠ ఉష్ణోగ్రతలునమోదయ్యాయి.