హైదరాబాద్: 28°C
తెలంగాణ

దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో పవర్ కట్

ASF: దహేగాం మండలంలోని కొత్మీర్ సబ్స్టేషన్ పరిధిలో 11 కేవీ బోర్లకుంట ఫీడర్‌ లైన్ పనుల కారణంగా కేస్లాపూర్, ఇట్ల్యాల, గొర్రెగుట్ట గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలగనుంది. మంగళవారం ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు.