MDK: మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సీఎస్ఐ చర్చి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, షీ టీమ్స్ అందిస్తున్న సేవలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
సీఎస్ఐ చర్చి పరిసరాల్లో షీ టీమ్ కార్యక్రమం


