NLG: యాసంగి సీజన్‌లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల ఏర్పడే అవకాశం ఉందన్నారు. నల్గొండ మండలం సూరారం గ్రామంలో ఈరోజు రైతులతో మాట్లాడి నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కోరారు.
తెలంగాణ
'యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి'


