హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ కాలేజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

NRPT: నారాయణపేట మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విద్యార్థినుల వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే విద్యార్థినులందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న హాస్టల్‌లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.