హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ నామినేషన్లపై డ్రోన్ నిఘా

చిత్తూరు జిల్లాలో గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను నియమించి, నామినేషన్ కేంద్రాలు, జనం గుమిగూడే చోట్ల, సున్నిత ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. కీలక కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రక్రియకు ఆటంకం కలిగించినా, హింసను రెచ్చగొట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.