NTR: విజయవాడ కొత్తపేటలో ఓ వ్యక్తి అదృశ్యం కలకలం రేపింది. స్థానిక గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన తాళ్ల ప్రసాద్.. షిరిడీ వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అతను వెళ్లిన రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయకపోవడం, ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.దీంతో ప్రసాద్ తండ్రి ప్రకాష్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
షిరిడీ వెళ్తున్నానని చెప్పి వ్యక్తి అదృశ్యం


