హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఊపందుకున్న నగర పంచాయతీ ఎన్నికల ప్రచారం

ELR: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. 22వ వార్డు కూటమి అభ్యర్థి మన్యం ధనలక్ష్మి మంగళవారం వేలంపేటలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి తనకు మద్దతుగా ఓట్లు వేయాలని కోరారు. వార్డులో గెలిపిస్తే అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.